- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎస్‌ల స్టేట్ మెంట్ రికార్డు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ (Telangana phone tapping case) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని సిట్ (SIT) మరోసారి విచారించింది. ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ మరోసారి విచారించింది. అలాగే వారి ఇచ్చిన స్టేట్‌మెంట్లను సిట్ రికార్డు చేసింది. ముగ్గురు మాజీ ఐఏఎస్‌లతో పాటు మాజీ ఐపీఎస్ లను సిట్ సాక్షులుగా విచారించింది. మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్ (Somesh Kumar), శాంతి కుమారిలను (Shanti Kumari) విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌లపై (Naveen Chand) సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది.ఉన్నతాధికారులు చెప్పినట్లుగానే తాను వ్యవహరించానని ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు చెప్పారు.
రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు తమ దర్యాప్తులో సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అసలు ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్ రావు నియామకం వెనుక ఎవరున్నారు? ఆయనను నియమించడంపై ఈ మాజీ అధికారులను సిట్ తాజాగా ప్రశ్నించింది. కేసు దర్యాప్తును స్పీడప్ చేసిన సిట్ మరోవైపు అనుబంధ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ప్రయత్నాలు చేపట్టింది. కాగా సిట్ మాజీ సీఎస్, ఉన్నాతాధికారులపై దృష్టి సారించడంతో త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం తప్పదా అనే చర్చ జరుగుతోంది.






