- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCA అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. జగన్మోహన్ రావుపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన అక్రమాలపై సీఐడీ (CID)దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన అక్రమాలపై సీఐడీ (CID)దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ (Apex Council) సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి సీజే శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. జూలై 28న నిర్వహించి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు పేర్కొన్నారు. ‘సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనం, అత్యున్నత ప్రమాణాలకు హెచ్‌సీఏ కట్టుబడి ఉందని అపెక్స్ కమిటీ పేర్కొంది. సంఘం విశ్వసనీయతను కాపాడటం, సంఘం విస్తృత ప్రయోజనాల రీత్యా అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిపై చర్యలు తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది. మోసం, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగానికి సంబంధించి వారిపై సీఐడీ, ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో హెచ్‌సీఏ నిబంధనలు 41 (6), రూల్ 51(4) (D) ప్రకారం వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, జగన్మోహర్ రావు స్థానంలో వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ తాత్కాలిక ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తారని అపెక్స్ కమిటీ వెల్లడించింది.






