ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 12:28:56  IST  )

ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు దాదాపు 9 నెలల పాటు కేసులో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు పూర్తి నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందజేశారు. అదేవిధంగా కేసులో నిందితులుగా ఉన్న వారిపై చార్జిషిట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు వద్దకు రిపోర్టు చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఫార్ములా ఈ-రేసు కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలతో పాటు A4, A5ల‌పై ఏసీబీ అధికారులు చార్జ్‌షీటు దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ను మూడు సార్లు ఏసీబీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

అయితే, ఫార్ములా ఈ-కారు రేస్‌లో భారీగా అవినీతి జరిగినట్లుగా ఏసీబీ తేల్చింది. కేసులో క్విడ్‌ ప్రోకోను అధికారులు స్పష్టమైన సాక్షాధారాలతో నిరూపించినట్లుగా సమాచారం అందుతోంది. ఫార్ములా ఈ-రేసు కోసం స్పాన్సర్‌షిప్‌ ఇచ్చిన సంస్థ నుంచి రేసు నిర్వహించిన సంస్థకు రూ.44 కోట్లు చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించారు. అందుకు బదులుగా స్పాన్సర్‌షిప్‌ సంస్థ నుంచి రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్‌‌ను బీఆర్ఎస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Next Story