అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ కేసు’లో కీలక పరిణామం

by Gantepaka Srikanth |

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద భారీ తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ కేసు’లో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌(Sandhya Theater Case) వద్ద భారీ తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు నేటికీ ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఛార్జ్‌షీట్ ఫైల్‌ అయ్యింది. అల్లుఅర్జున్‌ సహా 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్‌షీట్‌ వేశారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది. ఇలా తిప్పి పంపడం ఇది రెండోసారి కావడం గమనార్హం. దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో లోపాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. హార్డ్‌ డిస్క్‌లు, సీడీలు, పెన్‌ డ్రైవ్‌లు జతపరచకపోవడంతో తాజాగా మరోసారి ఛార్జ్‌షీట్‌ను రిటర్న్‌ చేసింది. 2024 డిసెంబర్‌ 4న పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానులను నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో.. రేవతి అనే మహిళ అక్కడిక్కడే మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం శ్రీతేజ్ నేటికీ చికిత్స పొందుతున్నారు.

Next Story