ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ కీలక పరిణామం.. ఐప్యాక్ సంస్థల్లో ఈడీ సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-02 09:09:43  IST  )

ఐప్యాక్ (I-PAC) సంస్థపై ఈడీ పంజా విసిరింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబైలోని కార్యాలయాలు, ఫౌండర్ల నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ కీలక పరిణామం.. ఐప్యాక్ సంస్థల్లో ఈడీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సంస్థ ఐప్యాక్ (I-PAC) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ (Enforcement Directorate) అధికారులు ఇవాళ ఉదయం నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐప్యాక్ ప్రధాన కార్యాలయాలతో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకుల నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లోని ఐప్యాక్ కార్యాలయాలపై ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఐప్యాక్ ఫౌండర్ల వ్యక్తిగత నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.

మనీలాండరింగ్ కోణంలో విచారణ..

బెంగాల్‌ బొగ్గు స్మగ్లింగ్ కేసులో భాగంగా గత కొంతకాలంగా ఐప్యాక్ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచిన ఈడీ అధికారులు, మనీలాండరింగా జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రాజకీయ వ్యూహాల కోసం వివిధ పార్టీల నుండి అందుకున్న నిధుల మళ్లింపుపై ప్రధానంగా దృష్టి సారించారు. విదేశీ నిధుల సమీకరణలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలకు ఎన్నికల వ్యూహాలను అందించే ఐప్యాక్ సంస్థపై ఈడీ దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ సోదాల అనంతరం ఈడీ అధికారులు అధికారికంగా ఏవైనా వివరాలు వెల్లడిస్తారేమో వేచి చూడాలి.

Next Story