- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అభ్యంతరాలు కోర్టులో దాఖలు చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వితో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగ్వితో నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు.
బనకచర్ల స్థానంలో నల్లమలసాగర్..
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ఏపీ ప్రభుత్వం.. ఆ ప్రక్రియను టెండర్ల వరకూ తీసుకెళ్లింది. అయితే.. రాష్ట్రప్రభుత్వం ఆ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. టెండర్ల ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును చేపడుతుండటంతో సాగునీటి వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఏపీ నిర్మించాలనుకుంటున్న నల్లమలసాగర్‌పై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. అందుకే సుప్రీంకోర్టులో అధికారికంగా అభ్యంతరాలు దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈ కేసులో తెలంగాణ తరపున వాదించేందుకు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్విని కోరింది. ఈ మేరకు శనివారం ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో దీనిపై కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి, న్యాయ బృందం, సాగునీటి, పర్యావరణ నిపుణులతో చర్చించనున్నారు.
ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా భారీగా నీటిని లిఫ్ట్ చేసి సమీపంలోని ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాలపై తీవ్రమైన ప్రభావం పడనుంది. తద్వారా కృష్ణా నదిలో వాటా కింద తెలంగాణకు లభించాల్సిన నీటి పరిమాణం తగ్గే ప్రమాదం ఉంది. అందుకే ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వాస్తవానికి ఈ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా యూఎన్ ప్రకటించింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లనలసాగర్ ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ఆరోపిస్తున్నది. పోలవరం అంచనా వ్యయాలు, డ్యాం సేఫ్టీ అనుమతులు, కట్అఫ్ వాల్యూ లెక్కింపు మొదలైన అంశాల్లో తెలంగాణ ప్రమేయం లేకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఏపీ కృష్ణా నదిలోని నీటి కేటాయింపులను ఉల్లంఘిస్తున్నదని.. సీడబ్ల్యూసీ క్లియరెన్స్ లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్నది.






