తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రెండు ఆస్పత్రుల నిర్మాణ వ్యయం భారీగా తగ్గింపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-24 10:10:46  IST  )

తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం(Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రెండు ఆస్పత్రుల నిర్మాణ వ్యయం భారీగా తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(Warangal Super Specialty Hospital), టిమ్స్‌(TIMS)ల నిర్మాణ వ్యయం రూ.1715 కోట్లు తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్‌ల నిర్మాణ వ్యయాన్ని బీఆర్‌ఎస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిందని సర్కార్ ఆరోపించింది. తొలుత రూ.3779 కోట్ల వ్యయంతో నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు 2021లో జీవోలు సైతం జారీ చేశారు. రెండేళ్లలో నిర్మాణ వ్యయాన్ని రూ.6714 కోట్లకు కేసీఆర్ సర్కార్ పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యయం‌ పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. నిర్మాణ వ్యయం పెంపులో నిబంధనలు ఉల్లంఘించినట్టు ఎంక్వైరీ కమిటీ గుర్తించింది. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు అడ్డగోలు నిర్మాణ వ్యయాన్ని పెంచినట్టు గుర్తించారు. రూ.6714 కోట్ల నుంచి రూ.5001 కోట్లకు నిర్మాణ వ్యయాన్ని సర్కార్ తగ్గించింది. నిన్నటి కేబినేట్‌లో రివైజ్‌డ్ ఎస్టిమేట్స్‌కు ఆమోదం తెలిపింది.

Next Story