సర్కార్ స్టూడెంట్స్ హ్యాపీస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం ప్రారంభమైంది.

సర్కార్ స్టూడెంట్స్ హ్యాపీస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని, ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ (ఇంటర్మీడీయట్ విద్యార్థులకు) అమలు చేసేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతో మరో అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం వేళల్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ (అల్పాహారం), అలాగే పాల పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేకూర్చనుంది. మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం వంటి సదుపాయాల వల్ల డ్రాపౌట్స్ (మధ్యలోనే చదువు ఆపేయడం) తగ్గి, హాజరు శాతం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో విద్యా రంగానికి సంబంధించిన మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి.

Next Story