తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగ సంఘాలు ఫుల్ హ్యాపీ

by Gantepaka Srikanth |

రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగ సంఘాలు ఫుల్ హ్యాపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టుగానే రాష్ట్రంలోని ప్ర‌తి గ్రామానికొక క్షేత్ర‌స్థాయిలో అధికారి ఉండేలా క్యాబినేట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇదే కాకుండా కొత్త‌గా ఏర్ప‌డిన డివిజ‌న్లు, మండ‌లాల‌కు సైతం కొత్త‌గా పోస్టుల‌ను మంజూరు చేసింది. వీటితో పాటు సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టుల‌కు సైతం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర క్యాబినేట్ నిర్ణ‌యం ప‌ట్ల డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌(డీసీఏ) రాష్ట్ర అధ్య‌క్ష‌ కార్య‌ద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ‌, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) రాష్ట్ర అధ్య‌క్ష‌ కార్య‌ద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌ (టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్య‌క్ష‌ కార్య‌ద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలోని 10,950 గ్రామాల‌కు క్షేత్ర‌ స్థాయి అధికారుల నియ‌మానికి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, కొత్త డివిజ‌న్లు, మండ‌లాల‌కు 217 పోస్టుల మంజూరు, 33 సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ పోస్టుల‌కు సైతం క్యాబినేట్ ఆమోదం తెలుప‌డం ప‌ట్ల సీఎం రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డికి, ఇత‌ర మంత్రుల‌కు, సీసీఎల్ఏ న‌వీన్ మిట్ట‌ల్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రెవెన్యూ శాఖ బ‌లోపేతంతో పాటు క్షేత్ర‌ స్థాయిలో రెవెన్యూ సేవ‌లు రైతులకు, ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతాయ‌న్నారు. దూరాభారం త‌గ్గుతుంద‌న్నారు. సేవ‌లు వేగంగా అందుతాయ‌న్నారు.

ట్రెసా హర్షం

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థకు అవసరమైన పోస్టులను మంజూరు చేసిందని, అలాగే 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్ లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని కొనియాడారు.

Next Story