Ponnam: రవాణాశాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు.. మంత్రి పొన్నం కీలక నిర్ణయం

by Prasad Jukanti |

నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు.

Ponnam: రవాణాశాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు.. మంత్రి పొన్నం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఇవాళ రవాణా శాఖ అధికారులతో సమీక్ష (Transport Department Review) నిర్వహించిన పొన్నం.. ఇకపై రవాణాశాఖలోఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు (Enforcement Teams) నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.

Next Story