TG: సీపీఐఎం కీలక నాయకురాలు కన్నుమూత

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-11 14:14:26  IST  )

తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులురాలు, సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కన్నుముశారు.

TG: సీపీఐఎం కీలక నాయకురాలు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కన్నుముశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బాన్సువాడలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులైన ఆమె, మహిళా లోకం సమస్యలపై నిరంతరం గొంతెత్తారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ, అణగారిన వర్గాల హక్కుల కోసం అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఉమ్మడి నిజామాబాద్‌ వ్యాప్తంగా సీపీఐఎం పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయడంలో ఆమె పాత్ర మరువలేనిదని ఆ పార్టీ శ్రేణులు స్మరించుకుంటున్నారు. ఆమె మరణవార్త తెలియగానే సీపీఐఎం రాష్ట్ర కార్యాలయం సహా వివిధ జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మరణం సీపీఐఎం పార్టీకి, తెలంగాణ అభ్యుదయ ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటున్నారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన ఆమె జీవితం నేటి తరం నాయకులకు స్ఫూర్తిదాయకం అని సీపీఐఎం రాష్ట్ర కమిటీ ప్రతినిధులు కొనియాడారు.

Next Story