- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి, అన్న ఇలా అందరూ తక్కువ చేసేవారే: కల్వకుంట్ల కవిత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం రోజే కాదు.. రోజూ మహిళలను గౌరవించాలని అన్నారు. పెద్ద కులం, చిన్న కులం అనేవి ఏమీ లేవు.. మహిళలంతా సమానమే అని చెప్పారు. మహిళ ఏ ఇంట్లో పుట్టినా సరే.. వివక్ష కామన్‌గా కొనసాగుతూ వచ్చింది. తండ్రి, అన్న, భర్త ఇలా అందరూ మహిళలను తక్కువ చేసేవారే. మహిళలు లేకపోతే సృష్టే లేదు అని విషయాన్ని అందరు మర్చిపోయారు అని కవిత గుర్తుచేశారు. అంతెందుకు.. మహిళలు లేకుండా అసలు తెలంగాణ ఉద్యమమే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ సాధనలో మహిళల పాత్రే కీలకమని చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్ సాధనతో జాగృతి చరిత్ర సృష్టించిందని కొనియాడారు. అంతేకాదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు పెరిగాయని కవిత విమర్శించారు.
మరోవైపు టీ20 ప్రపంచకప్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా.. భారతజట్టు ఫైనల్‌లో గెలవాలంటూ కల్వకుంట్ల కవిత ఆకాక్షించారు. టీమిండియాకు ఆల్ ద బెస్ట్ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. టూ టీమ్స్, వన్ హార్ట్‌బీట్ అంటే.. ఆ రెండూ జట్లు, భారత్, న్యూజిలాండ్ అని అనుకుంటే పొరబాటే. ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టుతో పాటుగా.. భారత మహిళల హాకీ జట్టుకు కూడా కవిత ఆల్ ద బెస్ట్ చెప్పారు. భారత క్రికెటర్లు తమ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకోవాలని.. అలాగే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఆడుతున్న భారత మహిళల హాకీ జట్టు కూడా విజయం సాధించాలని కవిత ఆకాంక్షించారు.






