R.Krishnaiah: ప్రభుత్వం కోరితే సలహాలు ఇచ్చేందుకు సిద్ధం.. సీఎం వ్యాఖ్యలపై ఆర్.కృష్ణయ్య

by Prasad Jukanti |

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల అంశంపై ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

R.Krishnaiah:  ప్రభుత్వం కోరితే సలహాలు ఇచ్చేందుకు సిద్ధం.. సీఎం వ్యాఖ్యలపై ఆర్.కృష్ణయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీసీ జేఏసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) స్పందించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు కానీ విద్యార్థుల చదువు, వారి భవిష్యత్ కూడా ముఖ్యమే కదా అని అన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన కృష్ణయ్య.. సమాజంలో చదువు చాలా ముఖ్యమైన విషయం అని చెప్పారు. ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు ఇతర అంశాలకు నిధులు ఇస్తున్నారు. కానీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 23 నెలలు అవుతోందని ప్రతి నెల కొంత బకాయిలు కాలేజీలకు చెల్లించినా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం కోరితే సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Next Story