- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కులగణన క్రెడిట్ ఆ ఇద్దరిదే.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
కులగణన(Caste Census)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కులగణన(Caste Census)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులగణన క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)దే అన్నారు. సర్వే రిపోర్ట్‌ను అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వే చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ సర్వేలో ముస్లిం బీసీలు కలిసి 51 ఉంటే.. తమ సర్వేలో 56 శాతంగా వచ్చిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీసీ జనాభాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కులగణన సర్వే నివేదికపై ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఏదైనా బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో బీసీల గణన మొదలుపెట్టారా అని ప్రశ్నించారు. ఇదొక చారిత్రాత్మక మార్పు అని అన్నారు. సామాజిక మార్పు కోసం రాహుల్ గాంధీ ద్వారా మొదలుపెట్టామని అన్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీల విషయంలో కాంగ్రెస్(Congress) పార్టీ నిబద్ధతతో ఉందని తెలిపారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామన్నారు. లక్షా 3వేల మంది ప్రభుత్వ సిబ్బందితో కులగణన సర్వే చేయించామని చెప్పారు.






