Congress: ఎంత కొట్లాడినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు: మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |

నైని కోల్ బ్లాక్ పంచాయతీ మీడియా సృష్టేనని మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Congress: ఎంత కొట్లాడినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎంత కొట్లాడినా తెలంగాణలో అధికారంలోకి రాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. కర్ణాటక, తెలంగాణలో బీజేపీ (BJP) లేదన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ అక్కడ ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీతో పాటు బీఆర్ఎస్ (BRS) పని కూడా అయిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణంపై స్పందిస్తూ ఇంకా 2 డీసీసీ ప్రెసిడెంట్లు, మహిళా అధ్యక్షురాలి ఎంపిక పెండింగ్‌లో తెలిపారు. కేటీఆర్ సోషల్ మీడియాను పట్టుకుని పాకులాడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్‍లో బీఆర్ఎస్ లేదన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు. కవిత సొంత పార్టీ పెట్టి పోటీ చేసే ఆలోచనలో ఉన్నదన్నారు. నైనీ కోల్ బ్లాక్ పంచాయతీ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ వద్ద ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

Next Story