- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Redd: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సీఎం కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు (Telangana Local Body Elections) పూర్తి కావడంతో ఎంపీటీసీ (MPTC Elections), జడ్పీటీసీ (ZPTC Elections), మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నిర్వహణపై జోరుగా చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఫుల్ జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో మిగతా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోందని, అన్నీ కుదిరితే జనవరిలో ప్రభుత్వం ఈ ఎన్నికలకు పోవచ్చనే టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఈ ఎన్నికల నిర్వహణలో తొందరలోనే అసెంబ్లీ సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తామన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఉన్నందునా భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ప్రతిపక్షాలతో అసెంబ్లీలో ప్రజాస్వామిక పద్ధతిలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామన్నారు.






