- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మహిళలకు CM రేవంత్ భారీ శుభవార్త
రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి: రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 67 లక్షల మహిళలు సంఘాలలో ఉన్నారు.. ఆ సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించేందుకు హైదరాబాద్ శిల్పారామంలో విలువైన స్థలంలో ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మహిళా సంఘాలలో మరింత మంది సభ్యులను చేర్పించి కోటి మంది సభ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలందరూ కోటీశ్వరులు అయ్యే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగా మొదటగా ప్రతి జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు ఇస్తామన్నారు. మహిళా సంఘాలలో ఉన్న సభ్యులకు ఒక్కొక్కరికి ప్రతి ఏటా రెండు జతల చీరలను అందజేస్తామన్నారు. ఇందుకోసం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. 1000 కోట్ల మెగావట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు.
ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల ఇప్పటికే 600 మంది మహిళలు బస్సుల యజమానులుగా ఉన్నారని అన్నారు. దేవాలయాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో.. విద్యాలయాలకు కూడా అంతే ప్రాథమిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల నిర్వహణ విషయంలో బాధ్యతలు తీసుకోండి అని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు సక్రమంగా రాకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి.. మిగతా సమయాల్లో అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేద్దామని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పాలమూరు ఎంపీ డీకే అరుణ, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు శ్రీహరి, వంశీకృష్ణ, ఈ ర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.






