S.I.R: తెలంగాణలో ఎస్ఐఆర్ అమలుపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

ఎస్ఐఆర్ పై బీఎల్‍వోలకు సీఈసీ కీలక ఆదేశాలు ఇచ్చారు.

S.I.R: తెలంగాణలో ఎస్ఐఆర్ అమలుపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (Special Intensive Revision) ప్రక్రియపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ( Chief Election Commissioner Gyanesh Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో (Telangana) ఎస్ఐఆర్ అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీఎల్‍వోలతో (BLOs) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అమలవుతోందని తెలంగాణలోనూ ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కెనడా కంటే తెలంగాణ పెద్దది అన్నారు.

సీఈసీ మావేశంలో గందరగోళం:

రవీంద్ర భారతిలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. రవీంద్రభారతిలో సీట్లు సరిపోక బీఎల్‍వోలు ఇబ్బందులు పడ్డారు. సరిపడా సీట్లు లేవంటూ బూత్ లెవల్ ఆఫీసర్లు ఆందోళనకు దిగారు. 500 సీటింగ్ కెపాసిటీకి వెయ్యి మందికి ఆహ్వానం ఇచ్చారని దీంతో సగం మంది బయటే నిలుచున్నామని బీఎల్‍వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్ధ్యానికి మంచి ఎందుకు పిలిచారంటూ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story