- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలి : నీతి ఆయోగ్ క్రిటికల్ మినరల్స్ నేషనల్ కమిటీ చైర్మన్
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ డీకే. సింగ్ అభిప్రాయపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆధునిక ప్రపంచంలో కీలక ఖనిజాలకు అధిక ప్రాధాన్యత ఉందని, కీలక ఖనిజ రంగంలో భారత్ ను స్వయం సమృద్ధి దేశంగా రూపు దిద్దడానికి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ డీకే. సింగ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో గురువారం కమిటీ ఛైర్మన్ డాక్టర్ డీకే. సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశంలో కీలక ఖనిజాల ఆవశ్యకత, లభ్యత, కీలక ఖనిజాల అన్వేషణ, అందుకు గల అవకాశాలు, వివిధ ప్రభుత్వ మైనింగ్ సంస్థలు తీసుకోవలసిన చొరవ, బాధ్యతలు తదితర అంశాల పైన లోతుగా చర్చించారు. కమిటీ మెంబర్ సెక్రటరీ, నీతి ఆయోగ్, డిప్యూటీ అడ్వైజర్ మినరల్స్ ఆర్. శరవణన్, సభ్యులుగా ఉన్న సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, ఇంకా ఇతర సభ్యులు పాల్గొన్నారు.
క్రిటికల్ మినరల్స్‌లో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తుంది..
దేశంలో గల ప్రాథమిక, ద్వితీయ క్రిటికల్ మినరల్స్ వనరులను కనుగొనడానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీ దేశ కీలక ఖనిజ అవసరాలు తీర్చడంలో తమ వంతు కృషి చేస్తుందని దీనికి సింగరేణి సంస్థ తన సంపూర్ణ సహకారం అందిస్తుందని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ మట్టిలో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్, బాటమ్ యాష్ లలో దాగి ఉన్న క్రిటికల్ మినరల్స్ ను వెలికితీయడానికి తమ వంతు కృషి చేస్తామని, జాతీయ కీలక ఖనిజ అవసరాలు తీర్చడంలో సింగరేణి సంస్థ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు.
క్రిటికల్ మినరల్స్ పాత్ర వెలకట్టలేనిది..
నీతి ఆయోగ్, డిప్యూటీ అడ్వైజర్ మినరల్స్ ఆర్. శరవణన్ మాట్లాడుతూ... సోలార్ విద్యుత్, బ్యాటరీలతో నడిచే వాహనాలు, ఎలక్ట్రానిక్ రంగ విస్తరణలో, రక్షణ రంగంలో క్రిటికల్ మినరల్స్ అవసరం ఎంతో ఉందని, దేశంలో ఈ వనరులు ఉన్నప్పటికీ, వాటి మైనింగ్ జరగడం లేదని కాబట్టి ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని కమిటీ అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో కీలక ఖనిజాల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది కనుక దేశంలో గల క్రిటికల్ మినరల్స్ వనరులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వ మైనింగ్ సంస్థలు, ప్రైవేటు మైనింగ్ సంస్థలు కలిసి నడవాలని సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు, సింగరేణి జీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






