Kishan Reddy: మనల్ని ఎంత నీచంగా చూశారో మర్చిపోయారా?

by Gantepaka Srikanth |

ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వేగంగా దూసుకపోతుందని, ప్రతి శాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వివిధ విధాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.

Kishan Reddy: మనల్ని ఎంత నీచంగా చూశారో మర్చిపోయారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వేగంగా దూసుకపోతుందని, ప్రతి శాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వివిధ విధాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఆదివారం హైటెక్స్‌లో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నాయని దేశంలో ఆర్థిక వృద్ధి పెరిగి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ కూడా కదలిక వచ్చిందన్నారు. మనదేశం ఇప్పటిదాకా ఫోర్త్-లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగిందని గతంలో బ్రిటన్ పరిపాలించగా భారతీయులను ఎలా నీచంగా చూడడానికి ప్రయత్నించిన చరిత్ర మనం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఏ విషయం మంత్రివర్గంలో చర్చకు వచ్చినా, అందరిలో ఒకే లక్ష్యం అభివృద్ధి మాత్రమే అన్నారు. ప్రధాని మోడీ అభివృద్ధి కావాలంటే రిఫార్మ్స్ తప్పనిసరి. రిఫార్మ్స్ లేకుండా ఏ మంత్రిత్వ కార్యక్రమం జరగకూడదు, ఏ బిల్లు పాస్ కాకూడదని చెబుతారని వెల్లడించారు.

రిఫార్మ్స్ లేకుండా క్యాబినెట్‌లో ఏ అంశం అప్రూవ్ చేయరాదన్న విధంగా బడ్జెట్‌లోనే ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే సిద్ధాంతాలతో మన దేశం ముందుకు సాగుతోందన్నారు. 2014లో మోడీ ప్రధానమంత్రి పదవి స్వీకరించే ముందు మన దేశ జీడీపీ సుమారు 106 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. 11 సంవత్సరాల్లో 331 లక్షల కోట్లకు పెరిగింది. ఇది దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబించే విశిష్ట సాధన అన్నారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన చర్యల ఫలితంగా, దారిద్రరేఖలో ఉన్న సుమారు 20 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఆ రేఖను దాటి, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించారని ఇది మోడీ సంకల్పానికి ప్రతీక అని గుర్తుచేశారు. మౌలిక వసతుల అభివృద్ధి ద్వారానే దేశ ప్రగతి సాధ్యమవుతుందని మన ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే అన్ని నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు విస్తరిస్తూ, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందన్నారు. అదే విధంగా విద్యారంగంలో కూడా తాము విస్తృత సంస్కరణలు చేపట్టాం. కొత్త యూనివర్సిటీలు, ప్రఖ్యాత విద్యాసంస్థలు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, విద్యను మరింత సమగ్రంగా, ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

Next Story