అప్పటివరకు రాహుల్‌ గాంధీ ప్రధాని కాలేడు.. టీ.కాంగ్రెస్ నేత ఆసక్తకిర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

అప్పటివరకు రాహుల్‌ గాంధీ ప్రధాని కాలేడు

అప్పటివరకు రాహుల్‌ గాంధీ ప్రధాని కాలేడు.. టీ.కాంగ్రెస్ నేత ఆసక్తకిర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ ఖాన్‌(Feroz Khan) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి బీటీమ్‌‌గా ఎంఐఎం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాంపల్లిలో కూడా బోగస్‌ ఓట్లతో ఎంఐఎం(MIM) గెలుపొందుతోందని.. వెంటనే ఆ బోగస్ ఓట్లన్నీ తొలగించాలని డిమాండ్ చేశారు. డూప్లికేట్ IDలతో దొంగ ఓట్లు సృష్టించారని ఆరోపించారు. బోగస్‌ ఓట్లపై తాను అనేకసార్లు అధికారులను కలిశానని.. ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ బోగస్‌ ఓట్లన్నీ ఎంఐఎం పార్టీకి చెందినవే అని చెప్పారు. బీజేపీ, ఎంఐఎం ఇద్దరూ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వారని అన్నారు. దొంగ ఓట్లు పట్టుకోకుంటే రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ప్రధాని కావడం కష్టం అని అభిప్రాయపడ్డారు.

కాగా, ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ ఓట్లు చోరీ చేస్తోందని ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, హరియాణా, బిహార్, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు ఓట్ల చోరీకి పాల్పడిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.

Next Story