- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీనామా చేస్తా: పోచారం శ్రీనివాసరెడ్డి
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాన్సువాడ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసినట్లు చెప్పారు. నా స్వార్థం కోసం కలిసి ఉంటే చెప్పుతో కొట్టండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే రాజీనామాకు కూడా తాను సిద్ధమే అని ప్రకటించారు. ప్రజలకు హానీ కలిగించే పని జీవితంలో చేయబోను అని అన్నారు. ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. ప్రజలే నా కుటుంబసభ్యులుగా భావిస్తానని అన్నారు. ఉన్నంతకాలం ఇలాగే జీవిస్తా అని స్పష్టం చేశారు. కానీ కొంతమండి కావాలనే నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏదో ఆశించి సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని నెగిటివ్‌గా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నా కోసం ఇప్పటివరకు సీఎం రేవంత్‌ని ఏదైనా అడిగినట్లు నిరూపిస్తే క్షణం ఆలోచించకుండా రాజీనామా చేస్తానని పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేసి గెలిచానని వెల్లడించారు.






