- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో సీఎం పదవి ఎవరికి..? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్
కాంగ్రెస్‌లో అనేక మంది సీఎం క్యాండిడేట్లు ఉన్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సీఎం పోస్ట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌లో అనేక మంది సీఎం క్యాండిడేట్లు ఉన్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సీఎం పోస్ట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిని ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదని స్పష్టం చేశారు. ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే సీఎం అభ్యర్థిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జైరాం రమేష్.. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని రైతులు, యువకులు, మహిళలను నమ్మక ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తే ప్రస్తుతం దాని లోపలే ఐటీ కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి ఆదాయం తీసేస్తే మిగతా జిల్లాల ప్రజల తలసరి ఆదాయం ఎంతో అందరికి తెలుసన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని దుయ్యబట్టారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని.. ఈ ఇద్దరు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ వస్తుందని ధీమ వ్యక్తం చేశారు.






