- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాకీ పట్టుకుంటే నడవదు.. మాజీ మావోయిస్టు దేవ్‌జీ సంచలన ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయం వేదికగా భేటీ అయిన అనంతరం మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సచివాలయం వేదికగా భేటీ అయిన అనంతరం మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత దేవ్‌జీ(Devji) అలియాస్ తిప్పిరి తిరుపతి మీడియాతో మాట్లాడారు. ‘రివార్డు పాలసీని రూ.కోటికి పెంచాలని సీఎంను కోరాం. ఐదు ఎకరాలు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. కానీ ఐదెకరాలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలుస్తాం. ఆ తర్వాత లొంగుబాట్లపై అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం నడవదని ప్రజలకు వివరిస్తాం’ అని దేవ్‌జీ వెల్లడించారు. సీఎం రేవంత్‌తో భేటీ అయిన వారిలో మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి సైతం పాల్గొన్నారు.






