కమ్యూనిజానికి మంచి రోజులు రాబోతున్నయ్

by Gantepaka Srikanth |

సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని పెట్టుబడిదారి విధానానికి విసిగిపోయి ప్రపంచ ప్రజలు కమ్యూనిజం(Communism) వైపు చూస్తున్నారని సీపీఐఎం తెలంగాణ(CPIM Telangana) కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) అన్నారు.

కమ్యూనిజానికి మంచి రోజులు రాబోతున్నయ్
X

దిశ, వెబ్‌డెస్క్: సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని పెట్టుబడిదారి విధానానికి విసిగిపోయి ప్రపంచ ప్రజలు కమ్యూనిజం(Communism) వైపు చూస్తున్నారని సీపీఐఎం తెలంగాణ(CPIM Telangana) కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారి విధానంతో అనేక సంక్షోభాలు ఏర్పడి సమానత్వం కోసం పోరాడే ప్రజలు కమ్యూనిజం వైపు చూస్తున్నారని.. సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని రాబోయే కాలంలో కమ్యూనిజానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. ప్రజలందరూ కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలలో భాగస్వాములు కావాలని జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఇటీవల అమెరికాలో నూతనంగా ఏర్పడిన ట్రంప్ ప్రభుత్వం భారతీయులను దేశం నుంచి గెంటి వేస్తుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) వారితో సన్నిహిత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నామని మరొక చెప్తుండడం ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

ఇటీవల కాలంలో శ్రీలంక(Sri Lanka)లో పెట్టుబడుదారి దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి కమ్యూనిస్టుల పాలనను కోరుకున్నారని అందులో భాగంగానే శ్రీలంక అధ్యక్షునిగా(President of Sri Lanka) కమ్యూనిస్టు నాయకుడు దేశ అధ్యక్షుడు అయ్యారని గుర్తు చేశారు. అందుకే భారతదేశంలో కూడా రాబోయే కాలంలో దేశాన్ని పరిపాలిస్తున్న పెట్టుబడుదారి విధానానికి కొమ్ముకాసే నాయకుపై ప్రజలు విసిగిపోయి కమ్యూనిస్టుల పాలన కోరుకోవడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో దోపిడీ దౌర్జన్యాలకు పీడనలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకు కమ్యూనిస్టులు పోరాడుతున్నారని అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే కేవలం సోషలిజమే మార్గమని.. కమ్యూనిస్టులు చేసే ప్రజాపోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Next Story