- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: కేసీఆర్ విచారణలో కీలక మార్పులు! రేపే కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్
కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ను జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేయనున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల ప్రకారం 11వ తేదీన (రేపు) కమిషన్‌కు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విచారణలో మాత్రం కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఓపెన్ కోర్టు కాకుండా ఇన్ కెమెరా ముందు విచారణకు కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచారణకు హాజరయ్యేలా కమిషన్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. రేపు కమిషన్ ముందుకు ఉదయం 11 : 15 గం.లకు విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు.
ఇక కేసీఆర్‌పై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. సమాధానాలపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు సైతం చేసినట్లు సమాచారం. కమిషన్ ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం ఇస్తారని తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఇప్పటి వరకు 17 మందిని కమిషన్ విచారణ చేసింది. ఇటీవల మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు విచారణ హాజరైన విషయం తెలిసిందే.






