- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ జర్నలిస్టులకు అలర్ట్.. కొత్త అక్రిడిటేషన్లపై కీలక ప్రకటన
జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో స్ర్కూట్నీ చేసి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తూ నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన జర్నలిస్టు ఆన్లైన్‌లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ మాసంలో అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని కమిషనర్ సీహెచ్. ప్రియాంక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈనెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌లు జారీ చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో దరఖాస్తు చేసుకొనే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.






