- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: స్థానిక ఎన్నికలపై BIG అప్‌డేట్
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల(Telangana Local Body Elections)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్డేట్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల(Telangana Local Body Elections)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్డేట్ ఇచ్చారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై నవంబర్ 7న మరోసారి కేబినెట్ భేటీ నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆర్డినెన్స్‌ను త్వరలోనే గవర్నర్కు పంపనున్నట్లు వెల్లడించారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) ని సవరించేందుకు కేబినెట్నిర్ణయించింది. ఈ ఫైల్‌పై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, సీఎం రేవంత్ ఇప్పటికే సంతకం చేశారు. ఇవాళ కేబినెట్ ఆమోదించడంతో ఆ ఫైల్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు. గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీచేయనున్నారు.






