TG: ఇంటర్ ఫలితాలపై కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ, సామాజిక మాధ్యమాలలో కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

TG: ఇంటర్ ఫలితాలపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ, సామాజిక మాధ్యమాలలో కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ, ఇందులో ఎటువంటి వాస్తవము లేదు. ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకుముందు కూడా ఎప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదు.

గతంలో ఫలితాలు విడుదలైన తేదీలు:

➤ 2014 – మే 3

➤ 2015 – ఏప్రిల్ 22

➤ 2016 – ఏప్రిల్ 22

➤ 2017 – ఏప్రిల్ 16

➤ 2018 – ఏప్రిల్ 13

➤ 2019 – ఏప్రిల్ 18

➤ 2020 – జూన్ 18 (కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేయటం జరిగింది)

➤ 2021 – జూన్ 28 (కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేయటం జరిగింది)

➤ 2022 – జూన్ 28

➤ 2023 – మే 9

➤ 2024 – ఏప్రిల్ 24

➤ 2025 – ఏప్రిల్ 22

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర అంశాలను బట్టి ఫలితాల విడుదల అయ్యే తేదీలు ప్రతి ఏటా మారుతుంటాయి. అదే విధంగా, ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది. మూల్యాంకన సమయాన్ని బట్టి, ఫలితాల విడుదల ప్రకటన చేస్తారు. ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరుతున్నాము. సామాజిక మాధ్యమాలలో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నమ్మవద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.

Next Story