- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ MLA యశస్విని రెడ్డి కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) సమీపిస్తోన్న వేళ విపక్ష బీఆర్ఎస్(BRS)కు భారీ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) సమీపిస్తోన్న వేళ విపక్ష బీఆర్ఎస్(BRS)కు భారీ షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ PACS చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, రాయపర్తి మాజీ ZPTC ఆకుల అరుంధతి సురేందర్ రావులు తమ అనుచరులతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గాంధీ భవన్(Gandhi Bhavan) వేదికగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెట్ అజారుద్దీన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) మాట్లాడుతూ.. అతి త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని అన్నారు. బీఆర్ఎస్ అధినాయకుల తీరుతో విసిగిపోయిన నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు.
కాంగ్రెస్‌లో సమన్యాయం ఉంటుందని భావించి చేరారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతుభరోసా, రుణమాఫీతో రైతులు, 50 వేల ఉద్యోగాలతో నిరుద్యోగులు, ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణంతో పాటు రూ.500 లకే గ్యాస్ సిలిండర్‌తో మహిళలు ఇలా అందరూ హ్యాపీగానే ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వల్ల రాష్ట్రం అప్పుల్లో కురుకుపోయినా.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రుణమాఫీ చేసినట్లు గుర్తుచేశారు. త్వరలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇవ్వబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్ట చేశారు.






