కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం..

by Disha Web Desk 11 |
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మహాగణపతి పూజతో కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జిల్లా మంత్రి మల్లారెడ్డి, ఆలయ చైర్మన్ తాటకం రమేష్ శర్మలు ఐదు రోజులు పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. స్వామి వారి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రూ. కోటి నిధులు మంజూరు చేసి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వీ

ఐపీ పాసులు ఉండవన్న మంత్రి.. కానీ..!

ముందు నుంచి మంత్రి మల్లారెడ్డి బ్రహ్మోత్సవాల సందర్భంలో వీఐపీ దర్శనాల కోసం ఎటువంటి పాసులు జారీ చేయమనే చెప్పుకొచ్చారు. ఎటువంటి వారైనా ఆన్ లైన్ ద్వారా దర్శన టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందని ముందు నుంచి స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. గురువారం కూడా బ్రహ్మోత్సవాల ప్రారంభం అనంతరం ఇదే మాట చెప్పుకొస్తూనే, మంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు సైతం వారి వారి గుర్తింపు కార్డును చూపించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారని, నేను కూడా నా గుర్తింపు కార్డుని చూపించే వీఐపీ దర్శనం చేసుకుంటానని తెలిపారు.

అయితే ఓ పక్క మంత్రి మల్లారెడ్డి ముందు నుంచి వీఐపీ దర్శన టికెట్లు ఉండవు అని చెప్తున్నప్పటికీ ఆలయ యంత్రాంగం మాత్రం వీఐపీ దర్శన టికెట్లను జారీ చేయడంపై కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మంత్రి మాటలు ఏమాత్రం లెక్కచేయకుండా, ఆయన దృష్టికి తీసుకురాకుండానే వీఐపీ టికెట్లను జారీ చేశారా..? లేదా ఆయన ఆదేశాలతోనే ఇది జరిగిందా అనే విషయాలపై అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఆరు చెక్ పోస్ట్ లు.. 18 పార్కింగ్ లాట్స్

బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగం ప్రటిష్ట బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు చేసింది. 400కు పైగా పోలీసులు బందోబస్తులో విధులు నిర్వహించి ఉన్నారు. ఐదు రోజులు పాటు 24 గంటలు రెండు షిఫ్ట్ లు వారిగా ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. అలాగే 6 చెక్ పోస్టులను ఏర్పాటు, 18 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక కోడ్ పాసులు ఉన్న వారికి, అంతర్జాలం ద్వారా దర్శన టికెట్లు పొందిన వారి వాహనాలను అనుమతిస్తారు.

ప్రాంతాల్లో ఇతర వాహనాలను పార్కింగ్ చేసేందుకు సౌకర్యం కల్పించారు. భక్తుల సౌకర్యార్థం ఉచితంగా బస్సు రవాణా కూడా కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమొయ్ కుమార్ పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు యంత్రాంగానికి సూచనలు చేస్తూ వస్తున్నారు.



Next Story

Most Viewed