నో డౌట్.. జూబ్లీహిల్స్‌లో విజయం మనదే: కేసీఆర్ ధీమా

by Gantepaka Srikanth |

ఉపఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవెల్లిలోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో కీలక సమావేశం నిర్వహించారు.

నో డౌట్.. జూబ్లీహిల్స్‌లో విజయం మనదే: కేసీఆర్ ధీమా
X

దిశ, ములుగు: ఉపఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవెల్లిలోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో కీలక సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి సునీత గోపీనాథ్ విజయంపై నమ్మకం వ్యక్తం చేస్తూ, పార్టీ ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజాభిమానాన్ని సంపాదించిందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాట్లాడుతూ, గోపీనాథ్ సేవలకు అభిమానంగా జూబ్లీహిల్స్ ప్రజలు సునీత గెలుపును ముందుగానే ఖరారు చేశారాని అన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలను మోసం చేసిందని, ప్రతిపక్షం నేతృత్వం తీసుకుంటున్న అభ్యర్థుల నేపథ్యమే ఈ ఎన్నికలో అసలు ప్రశ్నగా మారిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రజలను మళ్లీ ప్రమాదంలోకి నెడుతోందని ఆయన విమర్శించారు. పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పనిచేసి, భారీ మెజారిటీ సాధించే దిశగా ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు నగర గౌరవాన్ని నిలబెడతారని, శాంతి-భద్రతలు కాపాడే నాయకత్వాన్ని ఎన్నుకుంటారని కేసీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు. సమావేశంలో అభ్యర్థి మాగంటి సునీత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

Next Story