బ్రేకింగ్ న్యూస్.. జాతీయ పార్టీ ప్రకటనపై కేసీఆర్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ న్యూస్.. జాతీయ పార్టీ ప్రకటనపై కేసీఆర్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఎట్టకేలకు విజయదశమి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగానే కొత్త పార్టీని కేసీఆర్ ప్రకటించన ముహూర్తాలను బాగా విశ్వసించే కేసీఆర్.. పండితులు సూచించిన సమయం ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారని సమాచారం. అదే రోజు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంతో పాటు పార్టీ విస్తృతస్ధాయి సమావేశం కేసీఆర్ నిర్వహించనున్నారు. ముందుగా పార్టీ నేతలకు జాతీయ పార్టీ గురించి వివరించనున్నారు. అనంతరం ఆ సమావేశంలోనే జాతీయ పార్టీ పేరుతో పాటు విధివిధానాలను ప్రకటించే అవకాశముంది. భారతీయ రాష్ట్ర సమితి లేదా భారతీయ రైతు సమితి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed