Danam Nagendar : కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది : దానం నాగేందర్

by Muthe.Rajitha |

ఈనెల 27న బీఆర్ఎస్(BRS) తలపెట్టిన వరంగల్ మహాసభ(Warangal Meeting)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Danam Nagendar : కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది : దానం నాగేందర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 27న బీఆర్ఎస్(BRS) తలపెట్టిన వరంగల్ మహాసభ(Warangal Meeting)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో(BRS Silver Jubli Celebrations) భాగంగా కేసీఆర్(KCR) అధ్యక్షతన నిర్వహిస్తున్న వరంగల్ సభ సక్సెస్ అవుతుందని ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagendar) అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ను చూసేందుకు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని, సభకు భారీగా జనం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ చేసిన రీట్వీట్ లో తప్పేం లేదన్నారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితినే ఆమె రీట్వీట్ చేశారని వ్యాఖ్యానించారు. అంతేగాని ఆమె చేసిన పనిలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమీ లేదన్నారు.

కాగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటయి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఆ పార్టీ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన వరంగల్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇక ఈ సభపై అటు ప్రజల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం చేత కేసీఆర్ ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Next Story