బనకచర్ల ప్రాజెక్టుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-29 16:32:03  IST  )

బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) కీలక వ్యాఖ్యలు చేశారు.

బనకచర్ల ప్రాజెక్టుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని చెప్పారు. సాగు సంక్షోభాన్ని నివారించేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ ప్రయోజనాల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తహతహలాడుతున్నారని విమర్శించారు. స్వయంగా రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి ఏపీ ప్రయోజనాలు కాపాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని సాగునీటి రంగం గందరగోళంలో పడే అవకాశం ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోవద్దని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరాల్సిందే అని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టారని అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద గోదావరి జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో తీవ్రంగా యూరియా కొరత ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయి పోరాటాల్లో కార్యోణ్ముఖులను చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ భవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశం జరిగింది. కాంగ్రెస్‌కు పోటీగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆగస్టు 8వ తేదీన కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేసింది.

Next Story