కేసీఆర్ నోట మళ్ళీ TRS మాట: అధికారంలోకి రాగానే ఎత్తిపారేస్తామని ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-20 15:16:12  IST  )

"తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్‌దే మళ్ళీ అధికారం.. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది" అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ నోట మళ్ళీ TRS మాట: అధికారంలోకి రాగానే ఎత్తిపారేస్తామని ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: "తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్‌దే మళ్ళీ అధికారం.. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది" అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, మరోసారి ‘టీఆర్ఎస్’ (TRS) అనే పదాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా (HYDRAA) వ్యవస్థపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. మేము మళ్ళీ అధికారంలోకి రాగానే ఈ హైడ్రా అనే వ్యవస్థనే ఎత్తిపారేస్తాం అని కేసీఆర్ ప్రకటించారు. హైడ్రా బాధితులను ఆదుకుంటామని, మళ్ళీ గులాబీ జెండా ఎగరగానే పేదలకు అండగా నిలబడి వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు.

చంద్రబాబుపై విమర్శల బాణాలు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై కూడా కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన కరెంట్ ఛార్జీల పెంపు, బషీర్‌బాగ్ కాల్పుల ఘటనలను గుర్తు చేస్తూ, తెలంగాణ వ్యతిరేక శక్తులతో ప్రస్తుత ప్రభుత్వం చేతులు కలిపిందని ఆరోపించారు. పార్టీ పేరు మార్పు తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ప్రస్తావన తెస్తూ కేడర్‌లో ధైర్యం నింపారు. టీఆర్ఎస్ జెండా ఎప్పుడూ తెలంగాణ గడ్డపైనే ఉంటుంది. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. పేదలు, రైతులు పడుతున్న బాధలను చూడలేకపోతున్నాను.. వారందరికీ న్యాయం జరగాలంటే మళ్ళీ మన ప్రభుత్వం రావాలి అని పిలుపునిచ్చారు. ఈ సభతో జగిత్యాల పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరికతో పాటు కేసీఆర్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా నేను చావను నా కొడకా’.. CM రేవంత్‌కు కేసీఆర్ హెచ్చరిక

Next Story