కేసీఆర్ కుటుంబం అష్ట దిగ్భందనంలో ఉంది.. ఎమ్మెల్సే వేముల వీరేశం

by Kema Shiva Kumar |

కేసీఆర్ కుటుంబం అష్ట దిగ్భందనంలో ఉందని, వారు భయంతో కోర్టులకు పరుగులు పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు.

కేసీఆర్ కుటుంబం అష్ట దిగ్భందనంలో ఉంది.. ఎమ్మెల్సే వేముల వీరేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కుటుంబం అష్ట దిగ్భందనంలో ఉందని, వారు భయంతో కోర్టులకు పరుగులు పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. అపర మేధావి అయిన కేసీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని, అవినీతి జరగలేదని కేసీఆర్ భావిస్తే అసెంబ్లీకి ఎందుకు రాలేదని, ఆయన మోహం చాటేయడంతోనే ఆయన అవినీతికి పాల్పడినట్లుగా అర్థం అవుతోందని వీరేశం అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో మీడియాతో వేముల వీరేశం మాట్లాడుతూ కేసీఆర్ నేరం చేయకపోతే విచారణ సంస్థలకు ఎందుకు జంకుతున్నారని అన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కోసం రూ.12 వేల కోట్ల ఖర్చు చేసిన తర్వాత రద్దు చేసి కాళేశ్వరం తీసుకువచ్చారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చెత్త బుట్టలో వేయాలని, సీబీఐ విచారణను ఆపాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని వీరేశం ఆరోపించారు.

కాళేశ్వరంపైన అత్యంత పారదర్శకంగా అసెంబ్లీలో చర్చ జరిగిందని, బీఆర్ఎస్ పార్టీకి రూ.వెయ్యి కోట్ల డిపాజిట్లు, వేల కోట్ల అవినీతి డబ్బు ఉందని, పంపకాల్లోనే పంచాయితీ వచ్చిందని ఆయన ఆరోపించారు. కోర్టు ఇచ్చింది బ్రేక్ మాత్రమే కేసీఆర్ నేరాలకు ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చారని తెలిపారు. సీబీఐ విచారణ ఇంకా ప్రారంభం కాకుండానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత తేల్చి చెప్పిందని, హరీష్‌రావు, సంతోష్ రావు అవినీతి చేశారని కవిత మొదటి సాక్ష్యం చెప్పారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ డైరెక్షన్‌లోనే హరీష్ రావు గతంలో పని చేశారని, కేసీఆర్ డైరెక్షన్‌లోనే అవినీతి జరిగిందన్నారు. నిజాం కట్టిన పోచారం ప్రాజెక్టుపై నుంచి వరద పోయినా నిటారుగా నిలబడిందని, కాళేశ్వరం కట్టి ఐదేళ్లు కాకుండానే కూలిపోయిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును ఇతర దేశాల్లో కడితే చర్యలు అత్యంత తీవ్రంగా ఉండేవని, లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వాళ్లను ఏం చేయాలని అనిల్​రెడ్డి ప్రశ్నించారు.

Next Story