మానసిక రోగిని తలపించేలా కేసీఆర్ వ్యాఖ్యలు.. తుమ్మల కౌంటర్

by Prasad Jukanti |
మానసిక రోగిని తలపించేలా కేసీఆర్ వ్యాఖ్యలు.. తుమ్మల కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరరావు ఆరోపించారు. నువ్వు కొట్టినట్టు చేయ్యి నెను తిట్టినట్లు చేస్తాను అనే ధోరణిలో ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ మానసిక రోగిలా మాట్లాడుతన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం కేసీఆర్ మూర్ఖత్వం అని మండిపడ్డారు. గురువారం భద్రాద్రి కొత్తగూటెం జిలలా ఇల్లెందులో నిర్వహించిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల సన్నాహక భేటీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ కలలు కంటున్నారని, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పడిపోతే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రధాని మోడీ 400 సీట్లు అంటూ మ్యాజిక్ డ్రామా, మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా తేలేకపోయారని పైగా ఉన్న సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం నిరుపయోగమైన అప్పులు పెద్ద ఎత్తున చేయడంతో కొత్త రుణాలు కూడా అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని బీజేపీ, బీఆర్ఎస్ లు కర్కశంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిచి సోనియా, రాహుల్ గాంధీలకు అప్పగిద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story