ఆస్ట్రేలియాలో అట్టహాసంగా KCR జన్మదిన వేడుకలు

by GSrikanth |

సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు.

ఆస్ట్రేలియాలో అట్టహాసంగా KCR జన్మదిన వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండీగో, బల్లారాట్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిపారు. కేసీఆర్ పేరుమీద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేసి అభిమానం చాటుకున్నారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యంలో మెల్బోర్న్‌లో నిర్వహించిన వేడుకల్లో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగేందర్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ వందేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదగాలని కోరుకున్నారు. అనంతరం సాయికృష్ణ కల్వకుంట్ల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర మంత్రిపడగ, సతీష్ పులిపాక, సంతోష్, వెంకటేష్, తిరువీధుల, ఇతర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story