- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొంపముంచిన కాళేశ్వరం.. కేసీఆర్ సంతకంపై దుమారం
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో నాటి టీఆర్ఎస్ పెద్దఎత్తున ఉద్యమం చేసింది. నదీజలాల అంశం ఆ పార్టీకి జీవం పోసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ప్రధానంగా నదీజలాల అంశం ఆ పార్టీకి జీవం పోసింది. అదే అంశం నేడు బీఆర్ఎస్‌ను, ఆ పార్టీ అధినేతను ఇరకాటంలో పడేస్తున్నది. నీటి రంగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును నేడు మేథావులు, నీటిపారుదల రంగ నిపుణులు సైతం తప్పుపడుతున్నారు. నీటిపారుదల రంగంపై ఎంతో అవగాహన ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తీసుకుంటున్న నిర్ణయాలు తన స్థాయిలో తీసుకునేవి కావని చెబుతున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి విషయంలో గులాబీ పార్టీ విమర్శలపాలైంది. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టడంపైనా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నది.
కొంపముంచిన కాళేశ్వరం
అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం జపం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నేడు అదే ఇబ్బందిగా మారిందనే చెప్పొచ్చు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. ఈ ప్రభావం ఎన్నికల్లో ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రంగా మారింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై జస్టిస్పీసీ ఘోష్కమిషన్వేసింది. కమిషన్ ఎదుట స్వయంగా కేసీఆరే హాజరు కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి కాళేశ్వరంపై సమగ్ర విచారణకు సీబీఐ ఎంక్వయిరీ విధించాలని అసెంబ్లీలోనూ తీర్మానించింది. తాజాగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్విచారణకు ఆదేశించింది. తెలంగాణలో అత్యధికంగా ఖర్చు చేసిన కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులు రెండూ వివాదాల్లో చిక్కుకోవడం బీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టినట్టు అయ్యింది. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌తీరుపై రాజకీయంగానే కాకుండా నీటిపారుదల రంగ నిపుణులు సైతం తప్పు పడుతున్నారు.
ప్రాజెక్టు లొకేషన్మార్చినప్పుటి నుంచే విమర్శలు
తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్మార్చినప్పుటి నుంచే కేసీఆర్‌పై విమర్శలు, ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాళేశ్వరమైనా, మేడిగడ్డ అయినా ఎల్లంపల్లి నుంచే నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్లంపల్లికి ఆగస్టు నుంచి నవంబర్వరకు నీటి లభ్యతలో ఎలాంటి సమస్యా లేదు. కడెం, ఎస్‌ఆర్ఎస్పీ నుంచి కావాల్సినంత ఇన్‌ఫ్లో ఉంటుంది. అనేక సార్లు ఎల్లంపల్లి గేట్లు ఎత్తిన సందర్భాలు సైతం ఉన్నాయి. కేవలం జూన్, జూలై, డిసెంబర్, జనవరిలో నీటి ఇన్‌ఫ్లో అవసరం ఉంటుంది. ఈ నీటిని తమ్మిడిహెట్టి నుంచి తీసుకుంటే సరిపోతుంది. కానీ అవేవి పట్టించుకోకుండా కేసీఆర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆ పార్టీని ఇరుకున పెట్టినట్టు అయ్యింది.
నిధులు కేంద్రానివైనా..
నదుల అనుసంధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం గోదావరి – కావేరి నదిని లింక్చేస్తోంది. ఇందులో 148 టీఎంసీల నీటిని గోదావరి నది నుంచి తరలిస్తుంది. ఈ నీళ్లు సైతం ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించినవి. ఇందులో తెలంగాణకు 45 టీఎంసీల నీరు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని కోసం రెండు రిజర్వాయర్లను తన నిధులతోనే నిర్మించనుంది. నీటి తరలింపునకు అవసరమైన వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. దీనికి గాను సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేసీఆర్ వ్యతిరేకించి ముందుకు సాగనివ్వకుండా చేశారని పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ ఇదే విధంగా జూరాల కాకుండా శ్రీశైలంకు మార్చడంతో అంచనా వ్యయం పెరిగింది. జూరాలలో అయితే తక్కువ ఎత్తిపోసే అవకాశం ఉంటుందని, అధిక వ్యయమయ్యేలా కల్వకుర్తి, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్మించడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
299 టీఎంసీలపై చేసిన సంతకంపై దుమారం
కృష్ణా జలాల కేటాయింపు సందర్భంలో 299 టీఎంసీలకే కేసీఆర్ఏ విధంగా సంతకం చేశారోనని నీటిపారుదల రంగ నిపుణులకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇదే అంశం ప్రస్తుతం బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను ఇరకాటంలోకి నెట్టింది. శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడు వెడల్పు, రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్పై నిర్వహించిన అపెక్స్కౌన్సిల్సమావేశానికి కేసీఆర్ హాజరుకాకుండా హడావుడిగా కేబినెట్‌సమావేశం ఏర్పాటు చేశారని విమర్శలున్నాయి.
ఎంక్వయిరీలతో ఇబ్బందులు
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ఘోష్ కమిషన్వేసింది. పూర్తి స్థాయి విచారణ కోసం సీబీఐ ఎంక్వయిరీని కోరింది. తాజాగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సిట్విచారణకు ఆదేశించింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌నేతలపై ఉన్న కేసులకు తోడు మరో విచారణ ఆ పార్టీ నేతలను మరింత ఇబ్బందుల్లో నెట్టే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.






