- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్! ఆంజనేయుడు జ్ఞానులలో అగ్రగణ్యుడని, నిస్వార్థ నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తికి, నిరుపమానమైన శక్తికి మారుపేరైన ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామి వారి అపారమైన జ్ఞానాన్ని, నిస్వార్థ సేవను కేసీఆర్ కొనియాడారు. సంత్ తులసీదాస్ తన 'రామచరిత మానస్'లో పేర్కొన్నట్లుగా, హనుమంతుడు "జ్ఞానినాం అగ్రగణ్యం" అంటే జ్ఞానులందరిలోనూ అత్యున్నతుడని ఆయన గుర్తుచేశారు.
శ్రీ ఆంజనేయ స్వామి కేవలం బలశాలి మాత్రమే కాదని, వినయానికి, మృదు స్వభావానికి ఆయనే అసలైన మార్గదర్శి అని కేసీఆర్ పేర్కొన్నారు. ధర్మ రక్షణ కోసం తాను నమ్మిన శ్రీరాముని సేవలో తన శక్తినంతా ధారపోసి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజా సంక్షేమం కోసం నాయకత్వాన్ని తన భుజాల మీద మోసిన మహోన్నత వ్యక్తిత్వం స్వామి వారిదని ఆయన కొనియాడారు. ఆంజనేయ స్వామి చూపిన నిస్వార్థ సేవ మరియు పట్టుదల స్ఫూర్తితో సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ తన సందేశంలో కోరారు.






