KCR : చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేసీఆర్

by Muthe.Rajitha |   (  Updated:2025-04-20 10:46:50  IST  )

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నేడు 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

KCR : చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నేడు 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(BRS Cheif KCR) చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కోరుకున్నానని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందింది అని కొనియాడారు.

Next Story