K. Chandrashekar Rao : శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్

by Chukka Sudharani |   (  Updated:2023-09-07 08:13:21  IST  )

'శ్రీకృష్ణ జన్మాష్టమి’ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

K. Chandrashekar Rao : శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'శ్రీకృష్ణ జన్మాష్టమి’ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. "ఉట్ల పండుగ"గా పిలుచుకుంటూ యువతి, యువకులు కేరింతలతో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని సీఎం తెలిపారు. శ్రీకృష్ణుడి జీవితాన్ని అవలోకనం చేసుకుంటే స్థితప్రజ్ఞులుగా ఎదగవచ్చని సీఎం తెలిపారు. భగవద్గీత ద్వారా కర్తవ్యబోధన, లక్ష్య సాధన కోసం ఫలితం ఆశించని స్థితప్రజ్ఞతతో కూడిన కార్యనిర్వహణ వంటి పలు ఆదర్శాలను మానవాళికి అందించిన శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు ప్రజలందరికీ అందాలని సీఎం ప్రార్థించారు.

Next Story