- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పటి కేబినెట్‌కు కేసీఆరే బాస్.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కాసేపటి ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కాసేపటి ముగిసింది. ఈ మేరకు హైదరాబాద్ (Hyderbad)లోని బీఆర్కే భవన్‌లో విచారణకు హాజరైన మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, కమిషన్ చైర్మన్ పీ చంద్రఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా, కేబినెట్ నిర్ణయం మేరకు నిధులు విడుదల చేశానని స్పష్టం చేశారు. నిధుల విడుదల విషయంలో తన సొంత అజెండాలు ఏమి లేవని అదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్‌కు ఎదుట స్పష్టం చేశానని అన్నారు. నిధులు ఎవరికి ఇవ్వాలో కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగిందని అన్నారు. బడ్జెట్ కేటాయింపులను మాత్రమే ఆర్థిక శాఖ చూసుకుందని ఈటల రాజేందర్ తెలిపారు.
రూ.595 కోట్ల విషయం నాకు తెలియదు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు సంబంధం లేదని.. ముందుగా రూ.82 వేల కోట్ల వ్యయంగా అంచనా వేశారని తెలిపారు. ఆ తర్వాత ఆ అంచనాలు ఎంతకు పెరిగాయో తనకు తెలియదని అన్నారు. ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం రూ.595 కోట్లు ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తాను మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారని, తెలంగాణ సమాజానికి 25 ఏళ్లుగా తాను సుపరిచితుడినని అన్నారు. 2016 తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.16,500 కోట్లని.. ఆ తరువాత ప్రాజెక్ట్ వ్యయం రూ.38 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. తుమ్మిడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవనే రిపోర్టులు వచ్చాయని అన్నారు. ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతో కాళేశ్వరాన్ని ఎంపిక చేశారని పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీ వేశారని అందులో తాను తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉన్నామని అన్నారు. టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. అనంతరం కేబినెట్ కూడా మొత్తం బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం తెలిపిందని అన్నారు. టెక్నికల్ అంశాలన్ని పరిశీలించాకే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సమాచారం అంతా కేసీఆర్, హరీశ్‌రావుల వద్దే ఉందని ఈటల పేర్కొన్నారు.
కేబినెట్‌కు బాస్ కేసీఆర్..
కాళేశ్వరానికి మొదట్లో రూ.63 వేల కోట్ల అంచనా వేయగా.. క్రమంగా ఆ వ్యయం రూ.83 వేల కోట్లకు పెరిగిందని, చివరికి ఎంతైందో తనకు తెలియదని అన్నారు. కాళేశ్వరం విలువ, ఖర్చుతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని కామెంట్ చేశారు. అన్ని విషయాలు ఇరిగేషన్ శాఖతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్‌తోనే ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తాను కట్టానని కేసీఆరే చాలాసార్లు వేదికలపై చెప్పుకున్నారని అన్నారు. కేబినెట్‌కు బాస్ కేసీఆర్ అని.. నిర్ణయం తీసుకుంది ఆయనేనని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాస్తవ రిపోర్టులను బయటపెట్టాలని అన్నారు. ఎంత నష్టం జరిగిందో.. ఎవరు బాధ్యులతో ప్రభుత్వమే చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.






