- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మరోసారి ఆస్పత్రికి KCR.. వైద్య పరీక్షల అనంతరం నేరుగా అక్కడికే!
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇవాళ ఉదయం మరోసారి సోమాజిగూడ యశోద ఆసుపత్రి (Yashoda Hospital)కి వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇవాళ ఉదయం మరోసారి సోమాజిగూడ యశోద ఆసుపత్రి (Yashoda Hospital)కి వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన హాస్పిటల్‌కు వెళ్లనున్నట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. జర్వం తగ్గిన నేపథ్యంలో వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్‌లు చేసిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అయితే, గత ఐదు రోజులుగా కేసీఆర్ నందినగర్ (Nandi Nagar)లోని తన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటతో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే.. తెలంగాణకు జరిగే నష్టంపై పార్టీ ముఖ్య నాయకులకు వివరించి.. ఆ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తున్నది.






