- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప ఎన్నిక ముగిసేవరకు హైదరాబాద్‌లోనే కేసీఆర్.. కేటీఆర్, హరీష్ రావుకు కీలక బాధ్యతలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. గురువారం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో కీలక భేటీ నిర్వహించిన కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మీదనే ప్రధానంగా చర్చించారు. సిట్టింగ్ స్థానాన్ని వదులుకోకూడదని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహరచనపై దృష్టిసారించారు. ఉప ఎన్నిక ముగిసేవరకూ హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే ఉంటారని తెలుస్తోంది. ప్రచార బాధ్యతలను పూర్తిగా హరీష్ రావు, కేటీఆర్‌లకు అప్పగించారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ షోలు ప్లాన్ చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ప్రచారంపైనా దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు.
Next Story






