ఈనెల 12న బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

by Kema Shiva Kumar |

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 12న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించనున్నారు.

ఈనెల 12న బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 12న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభాపక్షాల ఉప నాయకులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇంచార్జీల నియామకంతో పాటు పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించాయి.

Next Story