- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టులో జై కేసీఆర్ నినాదాలు చేసిన స్వాములు !
కొండగట్టులో జై కేసీఆర్ నినాదాలు చేశారు స్వాములు. ఈ వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: పుణ్యక్షేత్రం కొండగట్టులో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండగట్టు దేవాలయంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున అభిషేకం జరగగా, ఆ తర్వాత లక్ష పూలతో పాటు ఫలాలతో మూలవిరాట్ ను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ క్రమంలో కొండగట్టు అంజన్న సన్నిధికి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. సోమవారం ప్రారంభమైన భక్తుల తాకిడి.. బుధవారం వరకు కొనసాగనుంది.
కొండగట్టు ఆలయంలో జై కేసీఆర్ నినాదాలు
కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండగట్టు ఆలయంలో జై కేసీఆర్ నినాదాలు చేశారు స్వాములు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వచ్చిన స్వాములకు కనీస సౌకర్యాలు లేవని, గంటల తరబడి లైన్ లో వేచి ఉన్నామని స్వాముల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని గుర్తు చేసుకుంటూ జై కేసీఆర్ అంటూ స్వాములు నినాదాలు చేసినట్లు వీడియో వైరల్ గా మారింది. క్లిక్






