కేసీఆర్ సిట్ విచారణ.. నందినగర్ నివాసం వద్ద డ్రోన్ కలకలం..!

by Ramesh Naini |

కేసీఆర్ ఇంటి పరిసరాల్లో డ్రోన్ కలకలం రేపింది. కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఇది చూసి ఆందోళన వ్యక్తం చేశారు.

కేసీఆర్ సిట్ విచారణ.. నందినగర్ నివాసం వద్ద డ్రోన్ కలకలం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో గులాబీ బాస్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ నందినగర్‌లోని నివాసం రెండో అంతస్తులో కేసీఆర్‌ను ఆరుగురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే కేసీఆర్ ఇంటి చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇంటి వద్ద డ్రోన్ కలకలం రేపింది. కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఇది చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, సిట్ విచారణ, కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో కేసీఆర్ నివాసం వద్ద డ్రోన్ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

కేసీఆర్‌ను విచారిస్తున్న సిట్ అధికారుల వద్ద పలు రాకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయని తెలుస్తోంది. 5 లాప్ టాప్స్, మూడు డిజిటల్ కెమెరాలు, హార్డ్ డిస్క్‌లు, డేటా కేబుల్స్, సీసీ కెమెరాలు (టెంపరరీ సెటప్), మొబైల్ ఫోన్లు సిట్ అధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను కూడా అధికారులు తీసుకొచ్చారు.

Next Story