బీఆర్ఎస్‍ను మళ్లీ కంట్రోల్‍ లోకి తెచ్చుకో.. KCR కు అసదుద్దీన్ ఒవైసీ సూచన

by Prasad Jukanti |

బీఆర్ఎస్ నేతలకు జ్ఞాపకశక్తి లేదని, వారు అధికారంలో ఉండగా ఏం చేశారో మర్చిపోయారని అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు.

బీఆర్ఎస్‍ను మళ్లీ కంట్రోల్‍ లోకి తెచ్చుకో.. KCR కు అసదుద్దీన్ ఒవైసీ సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీ పాత్ర మిత్రుడు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మళ్లీ తన నియంత్రణలోకి తీసుకోవాలని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడుతున్న నేతలకు జ్ఞాపకశక్తి తక్కువ అని వారు అధికారంలో ఉండగా ఏం చేశారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయారని సెటైర్ వేశారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనర్ బాలికపై అమానుష ఘటనకు నాటి బోర్డు చైర్మన్ కుమారుడి ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయని అప్పుడు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మీరు పార్టీ బాధ్యతలు ఎవరికైతే బదిలీ చేయాలని భావిస్తున్నారో పాపం వారికి జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉందని అందువల్ల కేసీఆరే స్వయంగా తిరిగి పార్టీని కంట్రోల్ చేయాలని వ్యాఖ్యానించారు.

నీట్ పేపర్ ఎలా లీకైంది?:

నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దు కావడంపై Asaduddin Owaisi స్పందించారు. కఠిన శిక్షలు విధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నో హామీలు ఇస్తూ పార్లమెంట్‌లో తీసుకొచ్చిన చట్టానికి ఏమైందని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయింది? గత ఒకటి, రెండు సంవత్సరాలుగా తీవ్రంగా శ్రమించి సిద్ధమవుతున్న విద్యార్థుల పరిస్థితి గురించి, కోచింగ్ సెంటర్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన వారి తల్లిదండ్రుల పరిస్థితిని ఆలోచించాలన్నారు. నీట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని కలలు కనే పేద విద్యార్థుల గురించి ఆలోచించండి. దీనికి బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story